
ఇంటి తర్వాత ఎక్కువ మంది సమయం గడిపేది ఆఫీసులోనే అందుకే, మీరు పనిచేసే చోట ప్రశాంతకరమై వాతావరణం నెలకొనాలి, సానుకూల శక్తి ఉండాలి అంటే తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. ముఖ్యంగా కొన్ని వస్తువులు మీ డెస్క్ దగ్గర పెట్టుకోవడం వలన మీరు చేసే పనిలో ఆటంకాలు లేకుండా, పనికి తగిన గుర్తింపు లభిస్తుందంట. ఇంతకీ ఆ వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం.

లక్కీ వెదురు : లక్కీ వెదురు మీ ఆఫీస్ డెస్క్ వద్ద పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ప్రతి కూల శక్తిని దూరం చేసి, సానుకూల శక్తిని తీసుకొస్తుంది. అదే విధంగా ఈ మొక్క మీ డెస్క్ వద్ద ఉండటం వలన అన్ని విధాల కలిసి వస్తుందంట.

తాబేలు : తాబేలు విగ్రహం వాస్తు దోషాలను తగ్గిస్తుంది. అయితే ఎవరు అయితే ఆఫీసులో సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు డబ్బు ఆదా చేయడానికి, త్వరగా ప్రమోషన్ పొందడానికి మీ డెస్క్ వద్ద తప్పకుండా తాబేలు విగ్రహం పెట్టుకోవాలంట. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

క్రిస్టల్ ట్రీ : వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరు అయితే క్రిస్టల్ ట్రీ తమ ఆఫీస్ డెస్క్ వద్ద పెట్టుకుంటారో, వారు తమ పనిలో విజయం సాధిస్తారంట. అదే విధంగా నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది.

పిరమిడ్ : మీరు పని చేసే కార్యాలయంలో, మీ డెస్క్ వద్ద పిరమిడ్ పెట్టుకోవడం చాలా శుభప్రదం. ఇది మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆఫీసులో మీకు శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందంట.