ఈ సంత్సరంలో చివరి బుధ సంచారం.. పాపం వీరి భవిష్యత్తు ఆగమాగమే!

Updated on: Dec 24, 2025 | 12:02 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయిక అనేది కామన్. కొన్ని గ్రహాలు ప్రతి నెలకు ఒకసారి సంచారం చేస్తే, కొన్ని ఆరు నెలలకు ఒకసారి, మరికొన్ని గ్రహాలు సంవత్సరానికి ఒకసారి సంచారం చేస్తుంటాయి. అయితే 2025, ఈ సంవత్సరంలో చివరి మాసంలో బుధ గ్రహం సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి కష్టాలు నష్టాలు ఎదురు కానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
బుధ గ్రహం ఈ సంవత్సరం డిసెంబర్ 29న ధనస్సు రాశిలోకి సంచారం చేయనుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి బుధ సంచారం.  బుధ గ్రహం జనవరి 17వరకు అదే రాశిలో ఉంటాడు.  దీని వలన కొన్ని రాశుల వారు అధిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందంట. అంతే కాకుండా వీరికి ఏ పని చేసినా కలిసిరాదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రెషర్ పెరుగుతుంది. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తపడాలి లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. భవిష్యత్తు గురించి ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి 2025లో చివరి బుధ సంచారం వలన అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఖర్చులు అధికం అవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి నష్టాన్ని మిగిల్చుతాయి. అనారోగ్య సమస్యలు తప్పవు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబంలో సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. ఏ పని చేయాలి అనుకున్నా ఆటంకాలు ఎదురు అవుతాయి. ఆఫీసులో సీనియర్స్ నుంచి ప్రెషర్ పెరగడం, ఆర్థిక ఇబ్బందులు సమస్యలను తీసుకొస్తాయి.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి బుధ సంచారం కారణంగా ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతారు. ఖర్చులు అధికం అవుతాయి. పనుల్లో ఆలస్యం అవుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి.