
పత్తి మొక్కలు : చాలా మంది దేవుడికి దీపం పెట్టడానికి ఇంటిలో పత్తి మొక్కను పెంచుకుంటుంటారు. అయితే ఇంట్లో పత్తి మొక్కలను అస్సలే పెంచుకోకూడదంట. వీటిని ఇంటిలోపల పెంచుకోవడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి, ముఖ్యంగా ఇంటిలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందంట.

చింత చెట్టు : గ్రామీణ ప్రాంతాల్లో చింత చెట్లు ఇంటి ముందే ఎక్కువగా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం ఇంటిలో చింత చెట్టు అస్సలే పెంచుకోకూడదంట. ఇది శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

పులి చింత : పులిచింత మొక్క ఇంటిలోనికి నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని ఇంటిలోపల పెంచుకోకూడదంట. ఇది ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో, వారి ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు వస్తాయంట.

ఇంగ్లీష్ ఐవీ : ఈ ప్లాంట్ చాలా మంది తమ ఇంటిలో పెంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కానీ వాస్తు ప్రకారం దీని చొరబాటు కారణంగా ఇది ఇంటిలో పెంచుకోవడం శుభప్రదం కాదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

బొన్సాయ్ ప్లాంట్ : చాలా అందంగా ఉండే మొక్కల్లో బొన్సాయ్ మొక్క ఒకటి. ఇది చూడటానికి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇది ఇంటిలో ఉంటే ఇంటికే అందాన్ని తీసుకొస్తుంది. కానీ ఈ మొక్క కుంగిపోయినట్లుగా ఉండటం వలన దీనిని ఇంటిలో పెంచుకుంటే, కెరీర్ ఎదుగుదల తగ్గడమే కాకుండా, ఇంట్లో పురోగతి కూడా ఉండదంట.