
స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన కన్నడ, మహారాష్ట్ర భక్తజనంతో క్షేత్రమంత సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువ జామున నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంటులలో బారులు తీరారు.

శ్రీ స్వామి అమ్మ వార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు, సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనానికి క్యూ లైన్ల ద్వారా ప్రవేశం ఇచ్చారు.

ఆన్‌లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు, కరెంట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు నాలుగు విడతలుగా ఉదయం 6:00 నుండి 8.00 కు మళ్లీ 11:30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు రాత్రి 7.30 నుండి 9.30 తిరిగి 10.30 నుంచి 11:30 వరకు మాత్రమే(BREAK) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు.

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దర్శనార్థమై క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఉన్న కన్నడ,మహారాష్ట్ర భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.