Srisailam: 35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. శ్రీశైలం మల్లన్నకు భక్తుల వెల్లువ

Updated on: Aug 27, 2026 | 5:25 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి 35 రోజుల్లో హుండీ కానుకల రూపంలో దాదాపు రూ.5.89 కోట్ల ఆదాయం లభించింది. నగదుతో పాటు 87 గ్రాములకు పైగా బంగారం, 4.250 కిలోల వెండి, వివిధ దేశాల కరెన్సీలు లభించాయి. మరోవైపు, శ్రీశైలంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న చెంచు గిరిజనులకు ప్రతి నెలా చివరి బుధవారం ఉచిత స్పర్శ దర్శనం, వసతి, భోజన సదుపాయాలను దేవస్థానం కల్పిస్తోంది.

1 / 5
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి భక్తుల కానుకల రూపంలో భారీ ఆదాయం లభించింది. గత 35 రోజులుగా హుండీల్లో సమర్పించిన కానుకలను దేవస్థానం అధికారులు లెక్కించగా, దాదాపు రూ.5.89 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. జులై 22 నుంచి ఆగస్టు 25 వరకు భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండి కానుకలను ఆలయ అలంకార మండపంలో ప్రత్యేకంగా లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ.5,88,89,846 ఆదాయం నమోదైనట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

2 / 5
నగదుతో పాటు విలువైన లోహాల రూపంలోనూ భక్తులు తమ మొక్కులు చెల్లించారు. హుండీల్లో 87 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 4.250 కిలోల వెండి లభించాయి. విదేశాల నుంచి వచ్చే భక్తులు సమర్పించిన వివిధ దేశాల కరెన్సీలు కూడా హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. యూఏఈ దిర్హమ్స్ 1,610, అమెరికా డాలర్లు 540, బ్రిటన్ పౌండ్లు 140, బహ్రెయిన్ దినార్లు 109తో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీలు లభించాయి.

3 / 5
హుండీల లెక్కింపును కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాలో సాగిన ఈ ప్రక్రియను దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం ఉద్యోగులు, శివసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు, శ్రీశైలం క్షేత్రంతో తరతరాలుగా అనుబంధం ఉన్న చెంచు గిరిజనులకు దేవస్థానం ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతి నెల చివరి బుధవారం వారికి ఎలాంటి రుసుము లేకుండా శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తోంది.

4 / 5
ఈ సందర్భంగా మేకలబండ, హఠకేశ్వరం, మార్కాపురం ప్రాంతాలకు చెందిన చెంచు గిరిజన భక్తులు శ్రీశైలానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తమ సంప్రదాయ వాయిద్యాలతో డప్పులు, తప్పెటలు మోగిస్తూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్న గిరిపుత్రుల సందడి ప్రత్యేకంగా కనిపించింది. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి గర్భాలయంలో స్పర్శ దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

5 / 5
దూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన భక్తులకు దేవస్థానం వసతి, భోజన సదుపాయాలను కూడా కల్పించింది. ప్రతి నెలా చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలన్న పాలకమండలి నిర్ణయంతో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. తమ ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తించి ప్రత్యేక దర్శనం కల్పిస్తుండటంపై గిరిజన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us