
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. అయితే అతి త్వరలో శుక్రుడు, నక్షత్ర సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే, నాలుగు రాశుల వారికి మాత్రం చెడు సమయం ప్రారంభం అయ్యింది. కాగా, శుక్రుడి సంచారం వలన ఏ రాశి వారికి సమస్యలు అధికం అవనున్నాయో ఇప్పుడు చూద్దాం.

మకర రాశి : మకర రాశి వారికి శుక్రుడి సంచారం వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆర్థిక సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇంటిలో మనశ్శాంతి కరువు అవుతుంది. అనుకోని ఆపదలు వస్తుంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా కష్టకాల సమయం. వీరికి అనుకోని ఆపదలు అధికం అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు. విద్యార్థులు ఎంత కష్టపడిన, తగిన ఫలితాన్ని పొందలేరు. అప్పుల బాధలు కూడా ఎక్కువ అవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తాయి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి : తుల రాశి వారికి ఎదుటి వారితో మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన వీరు మాట్లాడే మందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరు ఏ పని చేసినా దానిపై వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. అన్ని విధాలుగా సమస్యలు ఎదురు అవుతాయి. కాట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పని చేయడం మంచిది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మరింత కష్టపడాల్సిన సమయం. ఉద్యోగులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనుకోకుండా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వీరికి సీనియర్స్ నుంచి ఒత్తిడి అధికం అవుతుంది