Shubh Yoga 2025: ఈ రాశులకు ప్రయత్నంతో శుభ యోగాలు.. ఉద్యోగ, ధన లాభాలు పక్కా..!

Edited By:

Updated on: Oct 10, 2025 | 1:29 PM

Telugu Astrology: గ్రహాలు ఎప్పుడు రాశులు మారినా కొన్ని రాశుల వారికి శుభ యోగాలు కలుగుతుంటాయి. అందులోనూ శుక్ర, రవుల వంటి రాజయోగ గ్రహాలు రాశులు మారినప్పుడు పూర్తి స్థాయి శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల (అక్టోబర్) 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శుక్ర రవులు కన్యా రాశిలో కలుసుకోవడంవల్ల ఇటువంటి శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్ర రవులు ఏ రాశిలో కలిసినా, ప్రయత్నపూర్వకంగా మాత్రమే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రయత్నపూర్వక ధన లాభం, ప్రయత్నపూర్వక ఉద్యోగ లాభం వంటివన్న మాట. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు ఓ వారం రోజుల పాటు ఈ విధంగా ప్రయత్నపూర్వక శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, రవుల కలయిక వల్ల ఉద్యోగంలో తమ సమర్థతను, ప్రతిభను నిరూపించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. ఆదాయ మార్గాల మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లాభాలను పెంచుకుంటారు. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర రవుల సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమ స్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో రికార్డులు సృష్టిస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.

3 / 6
సింహం: రాశ్యధిపతి రవి ద్వితీయ స్థానంలో శుక్రుడితో యుతి చెందడం వల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, శుక్రుల కలయిక వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టే పెట్టుబడులు విశేష లాభాలనిస్తాయి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెంది పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊహించని ఫలితాలను ఇస్తాయి.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో రవి, శుక్రుల కలయిక వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభించే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో రెండు రాజయోగ గ్రహాలు కలవడం వల్ల కొద్ది ప్రయత్నంతో కీలకమైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. రాజీమార్గంలో ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. తండ్రి వైపు నుంచి సంపద లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.