
అయితే శ్రావణ మాసంలో భర్త భార్యకు ఆకు పచ్చ రంగు గాజులు కొనివ్వడం చాలా మంచిదంట. దీని వలన శుక్రగ్రహం బలపడి, దంపతుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది. అంతే కాకుండా సంపద కూడా రెట్టింపు అవుతుందంట. కాగా, ఇప్పుడు మనం భర్త భార్యకు ఆకుపచ్చ రంగు గాజులు కొనివ్వడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

శ్రావణ శుక్రవారం, రోజున భార్య భర్తలు కలిసి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం, భర్త తన భార్యకు పచ్చ రంగు గాజుల కొని, తొడగడం వలన భార్యకు అదృష్టం కలిసి వస్తుందంట. ఆమె జాతకంలో శుక్ర గ్రహం బలపడి, ఇంటిలో ఆనందం నెలకొంటుంది. ముఖ్యంగా సంపద పెరుగుతుంది. చేతినిండా డబ్బు చేరుతుందని చెబుతున్నారు పండితులు.

అంతే కాకుండా శ్రావణ మాసంలో పచ్చ రంగు గాజులు వేసుకోవడం వలన భర్త ఆయుర్ధాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో సాగిపోతుందని చెబుతున్నారు పండితులు.

అలాగే పచ్చ రంగు సంతానానికి సంకేతం అంటారు పండితులు. పిల్లలు లేని వారు, కడుపుతో ఉన్నవారు అయినా సరే శ్రావణ మాసంలో పచ్చ రంగు గాజులు వేసుకోవడం చాలా మంచిదంట. అమ్మవారి అనుగ్రహం కలిగి సంతానప్రాప్తి కలిగే ఛాన్స్ ఉంటుందంట. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయంట. భర్త తెచ్చిన గాజులు వేసుకోవడం వలన గౌరీ దేవి అనుగ్రహం కలుగుతుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు