శ్రావణ మాసంలో ఆ రాశులకు అదృష్టం..! సిరిసంపదలు, భోగభాగ్యాలు

Edited By:

Updated on: Aug 12, 2026 | 12:25 PM

Shravana Masam 2026 Horoscope: ఈ నెల(ఆగస్టు) 13 నుంచి సెప్టెంబర్ 11 వరకూ కొనసాగే శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారి ఇంట్లో శుభ కార్యాలు చోటు చేసుకోవడంతో పాటు, అనేక విధాలుగా సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగడానికి కూడా అవకాశాలున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు జరగడంతో పాటు, దాంపత్య జీవితంలో అనుకూలతలు వృద్ధి చెందడం, ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం, అనేక మార్గాల్లో ఆదాయం వంటివి తప్పకుండా జరుగుతాయి. అత్యంత శుభ గ్రహమైన గురువు ఈ మాసమంతా ఉచ్ఛ స్థితిలో ఉండడం, బుధ, శుక్రులు మిత్ర క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి నిత్యకల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోతుంది.

1 / 6
మేషం: ఈ రాశికి శ్రావణ మాసమంతా గురు, శుక్ర, బుధ గ్రహాలత వల్ల కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం, బారసాల వంటి శుభ కార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూడు పువ్కులు ఆరు కాయలుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విదే శీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు.

2 / 6
మిథునం: రాశ్యధిపతి బుధుడు, శుక్రుడితో పాటు, ధన స్థానంలో గురువు సంచారం వల్ల శ్రావణ మాసంలో ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. శుభ గ్రహాలు శుభ యోగా లను, రాజ యోగాలను కలిగిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు, మదుపులు, పెట్టుబడుల  ద్వారా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి శ్రావణ మాసమంతా గురువు ఉచ్ఛ స్థితిలోనూ, బుధ, శుక్రులు అనుకూలంగానూ కొనసాగడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి కొన్ని ముఖ్యమైన శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రతిభా పాట వాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

4 / 6
కన్య: లాభస్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల శ్రావణ మాసంతో ఈ రాశివారి దశ తిరిగే అవకాశం ఉంది. ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయాలు సిద్ధిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. జీవితం రాజభోగంగా సాగి పోతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

5 / 6
వృశ్చికం: ఈ రాశికి శ్రావణ మాసమంతా గురువు ఉచ్ఛ స్థితి వల్ల భాగ్య స్థానం బాగా బలంగా ఉండడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడంతో పాటు లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

6 / 6
కుంభం: ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శనిని ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో పాటు శుక్రుడు కూడా వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఈ శ్రావణ మాసమంతా ఏలిన్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు నెలకొంటాయి. మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెంది సమస్యల భారం తగ్గుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us