Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!

Edited By:

Updated on: Mar 17, 2026 | 7:03 PM

ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఇదే రాశిలో ఈ ఏడాదంతా కొనసాగుతాడు. శని మీన రాశి సంచారం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని క్రమశిక్షణనిస్తాడు. కర్మలకు అధిపతి అయిన శనీశ్వరుడు అనేక అనుభవాలను అందిస్తాడు. మేష, కుంభ, మీన రాశులకు ఏలిన్నాటి దోషం, సింహ రాశికి అష్టమ శని దోషం, కన్యా రాశికి సప్తమ శని దోషం, ధనూ రాశికి అర్ధాష్టమ శని దోషం ఏర్పడినప్పటికీ ఈ శని దోషాలు ఈ రాశుల వారికి మున్ముందు ఒక వరంగా మారే అవకాశం ఉంటుంది.

1 / 6
మేషం: ఈ రాశికి శని వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం ప్రారంభం అయింది. దీనివల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఇక ఈ దోషం వల్ల ఈ రాశివారికి శత్రువులు ఎవరు, శ్రేయోభిలాషులెవరు అన్నది అవగతమవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం ఎలా అన్నది అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. కష్టార్జితాన్ని జాగ్రత్త చేసుకోవడం తెలుస్తుంది.

2 / 6
సింహ రాశి : 
సింహ రాశి వారికీ త్వరలో మంచి రోజులు రానున్నాయి.  ఎలా అంటే మొత్తం వీరి చేతిలోకి వస్తుంది. వీరి కష్టాలు కూడా మొత్తం తొలగిపోనున్నాయి. వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళు శుభవార్త వింటారు. కొన్ని పరిచయాల జీవితం మారిపోతుంది. అంతేకాదు, కొత్తగా అవకాశాలు మీ వద్దకు వస్తాయి

సింహ రాశి : సింహ రాశి వారికీ త్వరలో మంచి రోజులు రానున్నాయి. ఎలా అంటే మొత్తం వీరి చేతిలోకి వస్తుంది. వీరి కష్టాలు కూడా మొత్తం తొలగిపోనున్నాయి. వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళు శుభవార్త వింటారు. కొన్ని పరిచయాల జీవితం మారిపోతుంది. అంతేకాదు, కొత్తగా అవకాశాలు మీ వద్దకు వస్తాయి

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల రాజకీయంగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. పది మందినీ కలుపుకునిపోయే తత్వం అలవడుతుంది. క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధత వంటి లక్షణాలు అలవడతాయి. ఆదాయాన్ని దాచుకునే ధోరణి పెరుగుతుంది. భవిష్యత్తులో కెరీర్ ఉజ్వలంగా సాగిపోవడానికి ఇవి తోడ్పడతాయి. కష్టం విలువ, కష్టార్జితం విలువ తెలిసి వస్తుంది. ఆధునిక నైపుణ్యాలు, భాషలను నేర్చుకోవడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది.

4 / 6

ధనుస్సు : శని గ్రహ మార్పు వలన ధనుస్సు రాశి వారికి వచ్చే నెల నుంచి మంచి రోజులు రానున్నాయి. దీని వలన వీరి జీవితం మొత్తం మారిపోతుంది. అంతే కాదు, ఇంకా ఊహించని మార్పులు ఎన్నో వస్తాయి. కొత్తగా ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక కష్టాలు తొలగిపోనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నిందలు మొత్తం పోతాయి.

5 / 6
కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని మూడవ దశ ప్రారంభమైంది. శని ధన స్థాన సంచారం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉచిత సహాయాలకు, అపాత్రదానాలకు అడ్డుకట్ట పడుతుంది. ఆచితూచి ఖర్చు చేయడం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. కుటుంబానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది.

6 / 6
మీన రాశి : ఈ ఏడాది మీన రాశి ఆదాయం (12) వ్యయం (12) గా ఉంది వీరి ఆదాయం ఎంత మంచిగా ఉంటుందో, అదే విధంగా ఖర్చులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఎంత ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ ఉహించని విధంగా డబ్బులు కూడా వస్తాయి.  శుభకార్యాలు కూడా జరుగుతాయి. రియల్ ఎస్టేట్‌లో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి.

Follow Us