Lord Shani: డిసెంబర్ నెలంతా శని యోగకారకుడే..! ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

Edited By:

Updated on: Nov 25, 2025 | 7:36 PM

Lucky Zodiac Signs: ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు డిసెంబర్ నెలలో కొన్ని రాశులకు యోగ కారకుడు కాబోతున్నాడు. నవంబర్ నెలాఖరు నుంచి తన సొంత నక్షత్ర మైన ఉత్తరాభాద్రలో సంచారం చేయబోతున్న శని శుభ గ్రహంగా మారి వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు కలలో కూడా ఊహించని శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు, ఆశలను నెరవేర్చే అవకాశం ఉంది. నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో ఆలయాల్లోని శని విగ్రహానికి 11 ప్రదక్షిణలు చేయడం, దీపం వెలిగించడం, శివార్చన చేయించడం వల్ల శని ఈ రాశుల వారిని ఉన్నత స్థితికి చేర్చే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ప్రస్తుతం శనీశ్వరుడు ఈ రాశికి లాభ స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలను, ఆశలను చాలావరకు తీర్చడం జరుగుతుంది. సొంత ఇంటి కలతో పాటు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగంలో అప్రయత్నంగా అందలాలు ఎక్కిస్తాడు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ది చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.

2 / 6
మిథునం: రాశినాథుడైన బుధుడికి మిత్రుడైన శని ప్రస్తుతం ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, శీఘ్ర పురోగతి చెందడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, విదేశీ ఉద్యోగాలు లభించడం, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి.

3 / 6
కన్య: రాశినాథుడైన బుధుడికి మిత్రుడైన శనీశ్వరుడు ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల దిగ్బల రాజయోగం కలిగింది. దీనివల్ల ధన ధాన్య సమృద్ది యోగం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడం, అధికార యోగం పట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.  సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది.

4 / 6
తుల: రాశినాథుడైన శుక్రుడికి అత్యంత సన్నిహితుడైన శనీశ్వరుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.  ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

5 / 6
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శని సొంత నక్షత్రంలో ప్రవేశించి బలోపేతం అవుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అనారోగ్యాలకు అవకాశం ఉండదు.

6 / 6
కుంభం: శ్యధిపతి శని ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా గతంలో ఎన్నడూ లేని పురోగతి ఉంటుంది. కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో పాటు ఎక్కువగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా కలిసి వస్తాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.