
తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న తరుచైరై రుణ విమోచనీశ్వర ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతారో, వారు ఇక్కడికి వెళ్లి పూజలు చేస్తే, దీర్ఘకాలిక రుణ భారం నుంచి బయటపడటమే కాకుండా, అడ్డంకులు అన్నీ తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారంట.

తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడికి నిత్యం వేల మంది, ఈ ప్రదేశంలోకి వస్తారంట. ప్రతి రోజూ దీనిని చేస్తారంట. ఈ ఆలయంలో ఉన్న స్వామి వారిని పూజించడం అప్పుల భారం క్రమంగా తగ్గి, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చాలా త్వరగా తొలిగిపోతయంట.

ఎవరు అయితే వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నారో, ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, తిర్లేని రుణాలు, మనశ్శాంతి కోల్పోవడం, ఆర్థిక పరమైన అడ్డంకులు, ఉద్యోగం లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కునే వారు రుణ విమోచనీశ్వర స్వామిని పూజించడం చాలా మంచిదంట. దీని వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆర్థిక స్థిరత్వం కలిగి, మనశ్శాంతి లభిస్తుందంట.

ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చాలా మంది భక్తులు తమ నిజ జీవితాలలో జరిగిన అద్భుతమైన మార్పులను పంచుకున్నారు. తీవ్రమైన అప్పులలో ఉన్నవారు, ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించిన కొద్ది రోజుల్లోనే తమ స్తంభించిపోయిన నిధులు ఊహించని విధంగా తిరిగి వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా, మూతపడిన పరిశ్రమలు మళ్లీ పుంజుకోవడం, కొత్త ఉద్యోగ, వ్యాపార అవకాశాలు తమకు లభించడం చూసి భక్తులు సంతోషిస్తున్నారు. దీని కారణంగా, డబ్బు లేకపోవడం వల్ల తమ మనసులను పీడించే నిరంతర భయం, ఆందోళన తొలగిపోయి, ప్రశాంతమైన జీవితం వికసిస్తోందని చాలామంది ధృవీకరిస్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు