
హిందూ మతంలో రాఖీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రత్యేకంగా పూజించి, తమ తోబుట్టువులకు రాఖీ కడతారు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా రాఖీ కట్టే సమయంలో తెగిపోవడం లేదా, రాఖీ కట్టిన తర్వాత కొద్ది సేపటికే అది ఊడిపోవడం జరుగుతుంది.

అలాగే కొన్ని సార్లు కొనుగోలు చేసే సమయంలో సరిగ్గా చూడకపోవడం వంటి పలు కారణాల వలన రాఖీ కట్టిన వెంటనే తెగిపోతుంది. అయితే దీంతో చాలా మంది భయపపోతుంటారు. అసలు రాఖీ ఏంటీ, ఇలా కట్టిన వెంటనే తెగిపోయింది. ఇది అశుభకరం కాదుగా అని టెన్షన్ పడిపోతుంటారు. కానీ రాఖీ తెగిపోవడం అశుభం కాదు అని చెబుతున్నారు పండితులు.

జానపదకథల ప్రకారం, రాఖీ తెగిపోవడం అనేది సోదరుడి దారిలో వచ్చిన ఏదైనా ప్రమాదం లేదా ప్రతికూల శక్తి , చెడు దృష్టి తొలిగిపోవడం, రాఖీ తెగిపోయినా అస్సలే భయపడకూడదు అని చెబుతున్నారు పండితులు. రాఖీ తెగిపోయిన రాఖీని నీటిలో నిమజ్జనం చేయడం లేదా తులసి మొక్కకు సమర్పించి, దేవుడిని ప్రార్థించి కొత్తది కట్టాలంట. దీని వలన ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా మీ బంధం కొనసాగుతుంది.

అంతే కాకుండా ఎప్పుడూ రాఖీ కట్టినా మనసులో దేవుడిని సమ్మరిస్తూ, సోదరుడి క్షేమం కోసం ప్రార్థిస్తూ రాఖీని కట్టాలి. అలాగే రాఖీ కట్టిన తర్వాత కూడా దానిని ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా, నీటిలో వేయడం లేదా తులసి మొక్క వద్ద వేయడం చేయాలంట. ముఖ్యంగా మీరు రాఖీ కట్టే సమయంలో అది తెగిపోతే, దానిని తులసి మొక్క వద్ద పెట్టడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు