
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయిక వలన యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే మార్చి 19న మీన రాశిలో ఉన్న శని, చంద్రుడు కలవబోతున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వలన విషయోగం ఏర్పడుతుందంట. ఇది మేష రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తుల రాశుల వారిపై ప్రభావం చూపనున్నదంట.

మేష రాశి : మేష రాశి వారికి పన్నెండవ ఇంటిలో విష యోగం ఏర్పడుతుంది. దీని వలన ఖర్చులు పెరగడమే కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోయే ఛాన్స్ ఉంది. కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. వ్యాపారంలో అధికంగా నష్టం చవి చూడాల్సి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి విషయోగం ఆరవ ఇంటిలో జరుగుతుంది. దీని వలన వీరు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

మిథున రాశి : మిథున రాశి వారికి శని చంద్రుల కలయిక వలన ఏర్పడే విషయోగం ప్రభావం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనుకోని ఆటంకాలు ఎదురు అవుతుంటాయి. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. అన్నివిధాల వీరు ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు మార్చి 19 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపారంలో ఎక్కువ నష్టాలు ఎదుర్కుంటారు. పనులు పెండింగ్‌లో ఉండటం సమస్యలను సృష్టిస్తుంది. అప్పుల సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా వీరికి అదృష్ట స్థానంలో విష యోగం ఏర్పడటం వలన వీరికి లక్కు అంతగా కలిసి రాదు.