
శని మూడో దృష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. ఏ రాశుల వారిపై అయితే శని మూడో దృష్టి పడుతుందో వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే? వారికి అడుగు అడుగునా సమస్యలే ఎదురు అవుతాయి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. వారిని శని ఓ ఆట ఆడుకుంటాడు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి : వృషభ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చంద్రుడు ఈ రాశిలోనే సంచరిస్తుండంతో , వృషభ రాశి వారిపై కూడా శని మూడో దృష్టి పడుతుంది. దీని వలన ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. అవమానాలు ఎదురు అవుతాయి. ఇంటిలో కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా కీలక సమయం. ఈ సమయంలో వీరు ఏది మాట్లాడినా, ఏ పని చేసినా ఇది వీరికే రివర్స్ అవుతుంది. అంతే కాకుండా ఇంటిలో కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితం లభించదు. మీరు ఒకటి అనుకుంటే, ఒకటి అవుతుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తాయి.

తుల రాశి : తుల రాశి వారిపై శని మూడో దృష్టి ఉండం వలన వీరు మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబంలో కలహాలు ఎక్కువ అవుతాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేసినా అడ్డంకులు ఎదురు అవుతాయి. ఇతరులతో మాట్లాడే క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది మీకు పెద్ద పెద్ద సమస్యలను తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.