
స్వయంభూ లంకేశ్వరుడుగా వనాల మధ్యలో వెలిసి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ భక్తులతో స్వయంగా పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే మహిమన్వితుడుగా విరాజిల్లుతున్నాడు ఇక్కడి పరమేశ్వరుడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వనాల మధ్య ఈ స్వామి వారు కొలువుదీరాడు. వనాల మధ్య ఈ పరమశివుడు వెలియడంతో ఇక్కడి వారు వన మల్లిఖార్జునుడిగా పిలుస్తుంటారు.

ఇక్కడి ప్రతి నిత్యం పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా భక్తులు స్వయంగా శివలింగాన్ని తాకి, పూజలు, అభిషేకాలు చేసే ఛాన్స్ ఉన్నదంన, మొగల్తూరు ప్రాతం వారే కాకుండా, చుట్టుపక్కల వారు కూడా ఈ ఆలయం వద్దకు వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దీంతో స్వయంభూలింగేశ్వర వన మల్లిఖార్జునుడిగా, ఆలయం ప్రసిద్ధికెక్కింది.శ్రీశైలం తరువాత శివలింగాన్ని నేరుగా భక్తులు ముట్టుకుని పూజించే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. ఈ స్వామి ఎండకు ఎండుతూ వానకు తడుస్తుండటం తో భక్తులు స్వామి వారికి పందిరి వేయగా అగ్నికి ఆహుతి కావడంతో శివలింగానికి పైన ఆలయం నిర్మించే ప్రయత్నం మానుకున్నారు భక్తులు.

పూర్వం మెగల్తూరులో అటవీ ప్రాతంగా ఉండే వనాల మధ్య స్వామి వారు స్వయంభువుగా వెలిశారు. దీంతో ఇక్కడికి వచ్చిన సాదువులు పక్కనే ఉండే కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి, స్వామివారికి అభిషేకం చేయడం చేసేవారంట. ఆ సమయంలో మొగల్తూరు రాజులు ఈ స్వామివారిని అడివిలోకి వచ్చి పూజించేవారు. అయితే కొంత మంది రాజులు కోట నుంచి అడవిలోని వచ్చి శివలింగాన్ని పూజించడం ఇబ్బందిగా భావించి, శివలింగాన్ని కోట వద్ద ప్రతిష్టించేందుకు నానా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయిందంట.

విగ్రహ న్ని తీసుకెళ్లేందుకు శివలింగం చుట్టూ లోతుగా తవ్వినా శివలింగం అంతం కనపడక పోవడం తవ్వే క్రమంలో స్వామివారి లింగానికి గుణపపుపోట్లు తగలడంతో రక్తం ఏరులై కారడంతో శివ లింగాన్ని కోట వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని రాజులు విరమించుకున్నట్లు పూర్వీకులు కథన. ముఖ్యంగా ఈ విగ్రహం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండటమే ఈ స్వయంభూ లింగేశ్వరు డుకు ఇష్టమని భక్తులు చెబుతారు.

అయితే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఆలయం పై వేసిన చలువు పందిర్లు అగ్నికి ఆహుతి అయ్యిందని నాటి నుండి శివరాత్రి సమయంలో వేసే చలువ పందిరులు విగ్రహం పై వేయరు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండే ఈ స్వామివారిని నేరుగా భక్తులు తాకి పూజిస్తారు.