
Medaram Jatara

ములుగు లోనే తిష్ట వేసిన మంత్రి సీతక్క అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు..అయితే గత జూలై మాసంలో కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి.. మేడారంకు వెళ్లే అన్ని రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి.. కొన్ని ప్రాంతాల్లో జంపన్నవాగుపై నిర్మించిన లో లెవెల్ కాజ్ వే లు, వంతెనలు కూడా కొట్టుకుపోయాయి.

రహదారులు పూర్తిగా పాడైపోయాయి.. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే పాడై పోయిన రహదారులను పరిశీలించిన సీతక్క త్వరితగతన రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు

జంపన్నవాగుపై కొట్టుకుపోయిన లో లెవెల్ కాజ్.వే ల నిర్మాణం కూడా జాతరకు పది రోజుల ముందే నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీతక్క జాతర పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు..

రహదారుల నిర్మాణం చిలకలగుట్ట వద్ద చేస్తున్న ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు..కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగురాష్ట్రాల నుండి జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు

రోడ్లు,డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీ, శానిటేషన్, హెల్త్ క్యాంపుల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.. జిల్లా కలెక్టర్, ITDA అధికారులు ఎప్పిటికప్పుడు పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు..