
ప్రముఖ జ్యోతిష్యులు నందిభట్ల శ్రీహరి శర్మ ప్రకారం కుంభంలో రాహువు, సింహంలో కేతువు, మీనంలో శని, మేషంలో కుజుడు, రాశిలోనే రవి,బుధ సంచారం, మిధునంలో గురు,శుక్రుల సంచార ప్రభావం ఉంటుంది. శని, గురువు, శుక్రుల అనుకూలతతో గత రెండు, మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్న వారికి అద్భుత అవకాశాలు, ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీ విద్య యాన అవకాశాలు లభిస్తాయి. వివాహం కాని వారికి నిశ్చయం, సంతానం లేని వారికి సంతాన లబ్ధి కలుగుతాయి.

అంతే కాకుండా వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. అంతే కాకుండా, కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. వ్యాపారం ప్రారంభం కూడా చేసే ఛాన్స్ ఉంది. దైవానుగ్రహం ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఎదగాలి అంటే తప్పకుండా కులదైవాన్ని ఆరాధించాలి. అలాగే సూర్యాష్టకం పారాయణం చేయడం చాలా మంచిది.

ఆర్థికంగా కలిసి వస్తుంది. రానీ బాకీలు వసూలు అవుతాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఈ సమయంలో ఆదాయం చేతికి అందుతుంది. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా వీరికి గురువు శుభ స్థానంలో, శుక్ర గ్రహంతో కలిసి ఉండటం వలన వీరికి ధనానికి లోటు ఉండదు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అవసరానికి ఆదాయం చేతికందుతుంది. అప్పుల బాధలు అన్నీ తొలిగిపోతాయి.

ఉద్యోగులకు కూడా ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఈ రాశి వారు ఎవరు అయితే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది. అంతే కాకుండా పై అధికారుల నుంచి మన్ననలు లభిస్తాయి. జీతం పెరగడం లేదా ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

ఈ రాశి వారు ముఖ్యంగా ,మే 21, 22 తేదీలలో ఇతరుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. అలాగే రాణి బాకీలు వసూలు, ఖర్చులకు సరిపడా డబ్బు అందుతుంది. లోన్‌లు మంజూరయ్యే అవకాశం ఉంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.