
కైలాసంలో పార్వతీ అమ్మవారితో ఆటలాడుతున్న పరమేశ్వరుడు ఆమె చేతిలో ఓడిపోయాడు. దీంతో గోవా ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాడు. ఆ స్వామిని వెతుకుతూ పార్వతి అమ్మవారు భూలోకానికి చేరుకున్నారు.

ఆమెను చూసిన పరమేశ్వరుడు పులి రూపంలో ఆమె ముందుకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా పార్వతి దేవి నిశ్చేష్టురాలయ్యారు. అనంతరం తేరుకొని త్రాహి మాం గిరీశ అంటూ ప్రార్ధించింది.

వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపంలోకి మారడంతో.. అమ్మవారు ఆనందించింది. మాం గిరీశ అనే పదమే కాలక్రమంలో మంగేశ్గా మారింది.

జువారి నది ఒడ్డున పరమశివుడు ప్రత్యేక్షమైన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. అయితే కొందరు భక్తులు అక్కడి శివలింగాన్ని సమీపంలోని ప్రియల్కు తరలించారు.

నాలుగు శతాబ్ధాల పాటు ఇక్కడే పూజలు నిర్వహించారు. 18వ శతాబ్ధంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని పునర్మించాలని నిర్ణయించారు.

దీంతో శివలింగాన్ని ప్రతిష్టించి.. ఇక్కడ ఉన్న ఎత్తయిన దీపస్తంభం ఆకర్షణగా నిలుస్తోంది.

ఇక్కడ ప్రధాన ఆలయంతోపాటు వినాయక, భైరవ, ముక్తేశ్వర్, గ్రామ దేవత శాంతేరి, దేవి భగవతి.. తదితర దేవుళ్ల ఆలాయాలు ఉన్నాయి.