
జ్యోతిష్యశాస్త్రంలో కేతు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గ్రహం గత జన్మలోని కర్మలకు ప్రతినిధిగా ఉంటుంది. దీని వలన జీవితంలో అకస్మాత్తుగా మార్పులు రావడం జరుగుతుంది. కేతు ప్రభావం ఉన్నవారు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. దీని వలన కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆఫీసులో సీనియర్ అధికారుల నుంచి ఒత్తిడి, ఉద్యోగం దొరకకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. అయితే 2026లో మూడు రాశులపై కేతు చెడు దృష్టి ఉండనున్నదంట. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవి అంటే?

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి 2026 అనుకూలంగా ఉన్నాకానీ మధ్యమంలో మాత్రం కేతు చెడు దృష్టి వలన ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి. అప్పులు పెరిగిపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా, మంచి ఫలితాలను అందుకోలేరు. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. ఇంటి లోపల కలహాలు పెరిగిపోతాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కేతు చెడు దృష్టి వలన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు బాధపెడతాయి. ఇంటి లోపల కలహాలు ఎక్కువ అవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి అదనపు భారాన్ని కలిగిస్తాయి. కుటంబంలోని సమస్యలు అనేక ఇబ్బందులను సృష్టిస్తాయి.

మీన రాశి : మీన రాశి వారికి కేతు గ్రహ ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా కలిసి రాదు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఇక ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది అస్సలే మంచి సమయం కాదంట. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా, ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ బాధిస్తాయి.