
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు షష్ట స్థానంలో జనవరి 2 వరకు కొనసాగడం, కుజ, రవుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో అధికార హోదా లభిస్తుంది. జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతులు లభించడానికి, కొత్త సవాళ్లను ఎదు ర్కోవడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. డిసెంబర్ నెలలో ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే సూచనలున్నాయి. స్థాన చలనం ఉండవచ్చు.

కర్కాటకం: ఈ రాశికి ధన, పంచమాధిపతులైన రవి, కుజుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగంలో మారడానికి అవకాశం ఎక్కువగా ఉంది. భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలో చేరడం జరుగు తుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు లభిం చడంతో పాటు ఉద్యోగరీత్యా విదేశీ పర్యటనలకు బాగా అవకాశం ఉంటుంది. లక్ష్యాలు, బాధ్యతలు పెరగడం, కొత్త సవాళ్లను ఎదుర్కోవడం జరుగుతుంది. శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది.

సింహం: రాశ్యధిపతి రవికి, చతుర్థాధిపతి కుజుడికి మధ్య పరివర్తన జరగడంతో పాటు, రాహువు కూడా అనుకూలంగా మారడం వల్ల డిసెంబర్ నెలలో ఈ రాశివారు ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో మరింత పురోగతి చెందడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు సొంత ఊరికి బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. కొత్త ఉద్యోగంలో పదోన్నతితో పాటు శీఘ్ర పురోగతికి కూడా అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో కూడా ఉన్నత స్థానం లభిస్తుంది.

తుల: ఈ రాశికి ధన, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడంతో పాటు, రాహువు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నత పదవి చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థాన చలనానికి, ఒక విభాగానికి అధిపతి కావడానికి అవకాశం ఉంది. డిసెంబర్ ప్రారంభంలో రాహువు రాశి మారడం వల్ల తప్పకుండా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ రీత్యా అనేక పర్యాయాలు విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఉద్యోగ జీవితం మారిపోతుంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు, దశమాధిపతి రవి పరివర్తన చెందుతున్నందువల్ల, రాహుకేతువుల అను కూలత వల్ల డిసెంబర్ 5 తర్వాత ఈ రాశివారి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో వీరికి మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏడాది చివరిలోగా ఒక సంస్థలో ఉన్నతాధికారి అవుతారు.

కుంభం: డిసెంబర్ 5న రాహువు ఈ రాశికి వ్యయ స్థానంలోకి ప్రవేశించడం, దశమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగం మారే అవకాశం ఎక్కువగా ఉంది. స్థాన చల నానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యో గంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగపరంగా వీరికి పట్టిందల్లా బంగారమవుతుంది.