ఇంటిలో నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?

Updated on: Dec 22, 2025 | 9:35 AM

ఇంటి వద్ద చాలా మంది పండ్ల చెట్లు, పూల చెట్లు పెట్టుకుంటారు. ఇవి ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా అనేక విధాలుగా ఉపయోగపడుతుంటాయి. అయితే చాలా మంది తమ ఇంటి వద్ద నిమ్మ చెట్టు పెట్టుకుంటారు. మరి ఇంటిలో నిమ్మ చెట్టు పెట్టుకోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో వివరంగా తెలుసుకోండి.

1 / 5
ఇంటి వద్ద నిమ్మ చెట్టు ఉండటం అనేది సహజం. చాలా మంది తమ ఇంటి పెరట్లో తప్పనిసరిగా నిమ్మ చెట్టును పెంచుకుంటారు. ఇది ఆరోగ్యపరంగా, అలాగే పాజిటివ్ శక్తిని అందిస్తుందని చెబుతుంటారు. అయితే ఫెంగ్ షూయ్ ప్రకారం ఇంటిలో నిమ్మ చెట్టు పెంచుకోవడం వెనుకున్న రహస్యం గురించి తెలియజేయడం జరిగింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఇంటిలోపల నిమ్మ చెట్టు కేవలం పండ్ల కోసమో, ఆరోగ్యం కోసమో కాదు, ఆహ్లాదకరమైన సువాసనను ఇచ్చే నిమ్మ చెట్టును ఇంటిలో పెంచుకోవడం వలన పాజిటివ్ శక్తి పెరగడమే కాకుండా, ఇది ఇంటిలోని దుష్ట శక్తులను తరిమికొడుతుందని ఆయన తెలియజేస్తున్నారు. అంతే కాకుండా దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుందంట. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారంట.

3 / 5
కానీ ఇంటిలోపల నిమ్మ చెట్టును సరైన దిశలో పెంచాలంట. నిమ్మ చెట్టు ఎప్పుడైతే సరైన దిశలో ఉంటుందో, అప్పుడే,  అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంట. కొంత మంది ఇంటిలోపల నిమ్మ చెట్టు పెంచుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా ఇంటి బయట ఉత్తరం దిశలో ప్రధాన ద్వారానికి ఇరువైపుల నిమ్మ చెట్టు పెంచుకోవడం మంచిదంట. దీనిని పశ్చిమ దిశలో పెట్టడం వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయంట.

4 / 5
నిమ్మ చెట్టు అనేది ప్రతి కూల శక్తిని గ్రహిస్తుంది. ఈ చెట్టు పుల్లటి వాసనను ఇస్తుంది. ఇది చెడు శక్తిని అడ్డుకొని, ఇంటిలో పాజిటివ్ శక్తిని పెంచుతుందంట. అంతే కాకుండా ఇది ఇంటిని చెడు దృష్టి నుంచి కాపాడుతుందంట. అంతే కాకుండా ఇది దృష్ట శక్తులు ఇంటిలోకి రాకుండా చేస్తుంది. అందుకే నిమ్మ చెట్టును ఇంటిలో పెంచుకోవడం చాలా మంచిదంట.

5 / 5
ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేదం, ఆరోగ్యం పరంగా కూడా ఇంటిలో నిమ్మ చెట్టు ఉండటం అనేది చాలా మంచిదంట. నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే చెట్టు ఆకుల నుంచి వెలువడే సహజ నూనెలు లిమోనెన్ వంటివి మానసిక ప్రశాంతతను అందించి, ఒత్తిడిని తగ్గిస్తాయి, ఈ చెట్టు వాసన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.