నంది చెవిలో కోరికలు ఎలా చెప్పాలి? ఎవరికీ తెలియని రహస్యం

Updated on: May 16, 2026 | 7:32 PM

శివాలయానికి వెళ్లినప్పుడు చాలా మంది నంది చెవిలో కోరికలు చెబుతుంటారు. అయితే, అలా చెప్పేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితం దక్కదు. నంది దేవుడి అనుమతితో ఆ పరమశివుడి అనుగ్రహం లభించాలంటే, కోరికను ఏ విధంగా చెప్పాలో ఎవరికీ తెలియని రహస్యాలు ఈ కథనంలో తెలుసుకోండి.

1 / 5
హిందూ సంప్రదాయంలో శివాలయ దర్శనానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి ముందు నందీశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు, తమ మనసులోని కష్టాలను, కోరికలను నంది దేవుడి చెవిలో చెప్పుకుంటే అవి నేరుగా ఆ భోళాశంకరుడికి చేరుతాయని భక్తుల నమ్మకం.

2 / 5
ఎంతో భక్తితో నంది చెవిలో కష్టాలు చెప్పుకున్నా పనులు అవ్వట్లేదే అని చాలా మంది బాధపడుతుంటారు. అప్పుల బాధల నుంచో, అనారోగ్యం నుంచో బయటపడాలని ఎంతో వేదనతో మొరపెట్టుకున్నా ఫలితం రానప్పుడు నిరాశ చెందడం సహజం. అయితే, గుడికి వెళ్లగానే గబగబా నంది దగ్గరకు వెళ్ళిపోయి నేరుగా కోరికలు చెప్పేస్తే ఎలాంటి లాభం ఉండదు.

3 / 5
నందీశ్వరుడి అనుమతి లేనిదే ఆ మహాదేవుడికి మీ మాట అస్సలు చేరదు. నంది చెవిలో కోరికలు చెప్పడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి, రహస్యం ఉన్నాయి. నంది దగ్గరకు వెళ్లగానే మొదటగా చేతులు జోడించి, ప్రశాంతమైన మనసుతో "హర హర మహాదేవా" లేదా "ఓం నమఃశివాయ" అని కచ్చితంగా మూడు సార్లు జపించాలి.

4 / 5
ఇలా మనస్ఫూర్తిగా జపిస్తున్నప్పుడు మన శరీరంలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ రావడాన్ని, కష్టాలన్నీ తీరిపోతాయన్న ధైర్యం కలగడాన్ని మనం గమనించవచ్చు. ఆ నమ్మకమే ఇక్కడ అత్యంత ముఖ్యం. ఇలా మూడు సార్లు శివనామాన్ని స్మరించిన తర్వాతే నందీశ్వరుడిని మనసారా వేడుకోవాలి.

5 / 5
ఆ తర్వాత నంది దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన శ్లోకంలా "బసవ బసవేశ్వర బసవరాజ నందీశ్వర పాహిమాం" అని స్తుతించాలి. ఈ విధంగా నందీశ్వరుడిని భక్తితో ప్రార్థించిన తర్వాత మాత్రమే మీ అసలైన కోరికను ఆయనకు నివేదించవలసి ఉంటుంది. ఇక్కడే మరో పవర్ఫుల్ రహస్యం దాగి ఉంది. మీ మనసులోని కోరికను ఎల్లప్పుడూ నంది యొక్క ఎడమ చెవిలోనే చాలా రహస్యంగా, ఇతరులకు వినపడకుండా చెప్పాలి.

Follow Us