Jagannath Mandir Odisha: ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి. ఆలయ గర్భగుడిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మార్చే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయ సందర్శన కోసం ఎన్నో దేశాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వస్తుంటారు.
Jagannath Temple Ahmedabad: గుజరాత్ అహ్మదాబాద్‌లోనూ జగన్నాథ దేవాలయం ఉంది. బలభద్ర, సుభద్ర, జగన్నాథుని రథయాత్ర కూడా ఇక్కడ జరుగుతుంది. పూరీ దేవాలయంలో పాటించే ఆచారాలనే ఇక్కడ కూడా పాటిస్తున్నారు.
Jagannath Temple Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జగన్నాథ ఆలయం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆలయం పూరీలోని జగన్నాథ దేవాలయం తరహాలో నిర్మించబడింది.
Jagannath Temple Myanmar: మయన్మార్‌లో కూడా ప్రసిద్ధ జగన్నాథ దేవాలయం ఉంది. నేపిడావ్‌లో ఉన్న జగన్నాథ ఆలయాన్ని సందర్శించడానికి దేశవిదేశాల నుంచి భక్తుల వస్తుంటారు. పూరీ తరహాలోనే ఇక్కడ కూడా అన్ని రకాల ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు.
Jagannath Mandir New Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని హోజ్ ఖాస్‌లోనూ జగన్నాథుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి కూడా దేశంలోని పలుప్రాంతాల నుంచి హిందువులు వస్తుంటారు.