
బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా దిమిత్రోవా. బల్గేరియాకు చెందిన ఈమె భవిష్యవాణి గురించి తెలియజేస్తుంది. 1911లో జన్మించిన బాబా వంగా 12 ఏళ్ల వయసులో తుఫాన్ కారణంగా కళ్లను కోల్పోయింది. ఇక అప్పటి నుంచే భవిష్యవాణి చెప్పడం మొదలు పెట్టింది. ఈమె అంచనాల ప్రకారం చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి అంటారు. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, 2004 సునామీ, అమెరికాను నల్ల జాతీయుడు పాలిస్తాడు అని చెప్పడం ఇలా చాలా వరకు నిజం అయ్యాయని చెబుతుంటారు.

కానీ ఈమె అంచనాలకు సంబంధించినవి ఇప్పటివరకూ ఏవీ కూడా రాతపూర్వకంగా లేవు. దీని వలన కొంత మంది బాబా వంగా జోస్యాన్ని ఎక్కువగా నమ్మితే, మరికొంత మంది కొట్టివేస్తారు. ఇక ఇదంతా పక్కన పెడితే, ప్రస్తుతం హంటా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇది ఎలుకల ద్వారా వ్యాపించే ఓ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు శ్వాస కోశ సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

అయితే దీనికి సంబంధించి బాబా వంగా ముందుగానే అంచనా వేసి తెలియజేశారంట. 2026, 2027 మధ్య కాలంలో అనేకమైన వ్యాధులు, వైరస్‌ల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అని ఆమె తెలియజేయడం జరిగిందంట. ప్రస్తుతం హంటా వైరస్ ప్రతి ఒక్కరినీ కలవర పెడుతున్న నేపథ్యంలో బాబా వంగా మరోసారి వైరల్‌గా మారింది.

హంటా వైరస్ సంక్రమణం గురించి బాబా వంగా ముందుగానే అంచనా వేశారంటూ సోషల్ మీడియలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి రాత పూర్వక ఆధారాలు లేవు. ఆమె హంటా వైరస్ గురించి తెలియజేసినట్లు కూడా ఎక్కడా లేదు. అయినప్పటికీ కొంత మంది దీనిని నమ్మితే , మరికొంత మంది మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హంటా వైరస్ కారణంగా మరోసారి బాబా వంగా వైరల్ అవుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.