
మౌనీ అమావాస్య జనవరి 28న సాయంత్రం 7.35 గంటలకు ప్రారంభమై, జనవరి 29న సాయంత్రం 6.5 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారు అమావాస్య రోజు నది స్నానం ఆచరించి, మౌన వ్రతం, ఉపవాస దీక్ష చేయడం వలన గ్రహాల చెడు దృష్టి నుంచి బయటపడతారంట. అంతే కాకుండా కొన్ని రకాల చెడు గండాల నుంచి బయటపడి , లక్కు కలిసి రావడంతో ఆనందంగా ఉంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కుంభరాశి వారికి ఏలి నాటి శని చివరి దశలో కొనసాగుతుంది. అయితే ఈ రాశి వారు ఎవరు అయితే ఈ రోజున ఉపవాసం ఉంటూ, ధ్యానం చేస్తారో, వారికి ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుందంట. ఖర్చులు తగ్గిపోయి ఆదాయం పెరగడం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి రావడం జరుగుతుందంట.

కర్కాటక రాశి వారికి మౌనీ అమావాస్య లక్కు తీసుకొస్తుంది. వీరు ఈరోజున దాన ధర్మాలు చేయడం , ఉపవాసం ఉండటం వలన అన్నింట్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందంట.

మీన రాశి వారికి ఏలి నాటి శని ప్రారంభం అయ్యింది. అయితే ఈ రోజున ఎవరు అయితే ఉదయాన్నే నది స్నానం ఆచరించి, ఆలయాలకు వెళ్లి దైవ దర్శనాలు చేస్తారో వారికి ఏలినాటి శని నుంచి విముక్తి లభించి, వృత్తి , ఉద్యోగాల్లో కలిసి వస్తుందంట.

మకర రాశి వారు మౌనీ అమావాస్య రోజున మౌన వ్రతం పాటించడం వలన అన్ని విధాల కలిసి వస్తుందంట. వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా దృఢంగా ఉంటారని, విదేశీప్రయాణాలు కలిసి వస్తాయని చెబుతున్నారు నిపుణులు.