
కలియుగం గురించిన భవిష్యవాణిలు ఉన్నాయి. ఇందులో ఉన్నవి చాలా వరకు నిజం అయ్యాయని ఇప్పటికే నిరూపితమైన విషయం తెలిసిందే. అయితే సంత్ అచ్చుతానంద దాస్ రచించిన భవిష్య మూలికలో 2026కు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయంట. అవి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి షాక్‌కు గురి చేస్తున్నాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

2026లో యుద్ధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభం, అవాంఛనీయ సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. వీటి నుంచి ప్రజలు తప్పించుకోలేరు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అందులో పేర్కొనడం జరిగిందంట. దానికి తగ్గట్టుగానే సంవత్సరం ప్రారంభం నుంచే యుద్ధాలు , ఇంధన సంక్షోభం వంటి అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ముఖ్యంగా బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది. కాగా, దీని గురించి భవిష్య మూలికలో కూడా ప్రస్తావించడం జరిగిందంట.

సుమారు 500,600 సంవత్సరాల క్రితం ఐదుగురు పంచముఖులు ఓడియా భాషలో తాళపత్రాలపై రచించిన ఈ పవిత్ర గ్రంథం. ఇందులో అనేక సంఘటనల గురించి ముందుగా తెలియజేయడమే కాకుండా, వారు అనేక సూచనలు చేశారు. అయితే ఇందులో ఆర్థిక సంక్షోభం గురించి నొక్కి చెప్పారని, అందుకే ప్రధాని మోదీ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం రాబోతుందని ముందుగానే ప్రజలను హెచ్చరిస్తున్నారు, అది భవిష్య మూలికలోని అంచనాలను బట్టే ఆయన ఈ సూచన చేశారు అని కొందరు చెప్పుకొస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేళ్లు అవుతుంది. భవిష్య మూలికలోని సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరే ఛాన్స్ ఉందేమో అందుకే మోదీ ఈ సూచనలు చేశారంటూ చెప్పుకొస్తు్న్నారు. పాశ్చాత్య దేశాలతో యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా భవిష్య మాలిక అంచనా వేస్తోంది. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.