Gajkesari Raj Yoga: ధన్‌తేరస్ కంటే ముందే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

Updated on: Oct 05, 2025 | 11:49 AM

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహాలు సంచారం చేసే సమయంలో కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అక్టోబర్ 12న చంద్రుడు దేవ గురువు బృహస్పతి ఇప్పటికే ఉన్న మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో చంద్రుడు, గురుల సంయోగం జరగనుంది. ఈ సంయోగాన్ని గజకేసరి రాజయోగం అంటారు. ఈ యోగం వేద జ్యోతిషశాస్త్రంలో చాలా శుభప్రదంగా భావిస్తారు.

1 / 5
అక్టోబర్ నెలలో గజకేసరి రాజయోగం ఒక ప్రత్యేక జ్యోతిషశాస్త్ర కలయిక ఏర్పడుతోంది. ఇది ధన త్రయోదశికి ముందు జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. అక్టోబర్ 12న చంద్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు, ఇప్పటికే బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. ఈ సంయోగాన్ని గజకేసరి రాజయోగం  అని పిలుస్తారు. ఈ యోగం జ్యోతిషశాస్త్రంలో చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ గజకేసరి రాజయోగం ప్రభావం మానసిక శాంతి,  ఉత్సాహాన్ని తీసుకురావడమే కాదు ఆర్థిక రంగంలో గణనీయమైన పురోగతిని కూడా సూచిస్తుంది.

2 / 5
గజకేసరి రాజయోగం వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. వీరు కెరీర్ లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆకస్మిక సానుకూల మార్పులను పొందుతారు. గజకేసరి రాజయోగ ప్రభావం ఈ రాశుల వారికి పురోగతి మార్గాలను తెరుస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. అంతేకాదు మానసికంగా సంతోషంగా ఉంటారు. జీవితంలో కొత్త ఉత్సాహం దొరుకుతుంది. ఈ గజకేసరి రాజయోగం  వల్ల ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.

3 / 5
వృషభ రాశి: ఈ సమయంలో వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక సానుకూల మార్పులను తెస్తుంది. వీరి సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఏర్పడిన ఈ రాజయోగం వీరి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. వీరు తమ ఆలోచనలను, భావాలను బాగా వ్యక్తపరచగలరు. వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాలలో సంబంధాలను బలోపేతం చేయగలరు. ఈ సమయంలో నిలిచిపోయిన నిధులు అకస్మాత్తుగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుడుతుంది. పని లేదా వ్యాపారం మార్కెటింగ్, మీడియా, బ్యాంకింగ్, గణితం లేదా స్టాక్ మార్కెట్‌కు సంబంధించినది అయితే ఈ సమయంలో మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు లేదా పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కూడా ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. అంతేకాదు ఈ సమయంలో వీరి ఆలోచన, ప్రణాళిక సామర్థ్యాలు అద్భుతంగా ఉంటాయి. ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఈ కాలంలో భవిష్యత్తు కోసం డబ్బులను ఆదా చేసుకుంటారు.  మొత్తంమీద ఈ సమయం వృషభ రాశి వారికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది

4 / 5
మిథున రాశి: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా శుభప్రదమైన అవకాశాన్ని తెస్తుంది. జీవితంలో అనేక సానుకూల మార్పులను తెస్తుంది. ఈ రాజయోగం వీరి జాతకంలో లగ్న ఇంట్లో ఏర్పడుతోంది. కనుక ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వం మరింత మందిని ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో వీరి తెలివితేటలు, ఆలోచనా సామర్థ్యాలు ముఖ్యంగా పదునుగా ఉంటాయి. జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధించడంలో సహాయపడతాయి. వివాహితులకు ఈ కాలం అవగాహన , ప్రేమతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని తెస్తుంది. ఈ కాలంలో పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇది వీరి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిని కొనాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంతేకాదు ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. అదృష్టం వీరి వైపు ఉంటుంది. సామాజిక గౌరవాన్ని కూడా పొందుతారు. మొత్తంమీద ఈ సమయం మిథున రాశి వారికి ఆనందం, పురోగతికి చిహ్నంగా ఉంటుంది.

5 / 5
కన్య రాశి: గజకేసరి రాజయోగం కన్యారాశి వారికి ముఖ్యంగా వృత్తి, వ్యాపార పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాజయోగం వీరి కర్మ భావాన్ని ప్రభావితం చేస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ సమయం కొత్త ప్రారంభాలకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది వీరి జీవనశైలిని మెరుగుపరుస్తుంది. నిరుద్యోగస్తులకు ఈ సమయంలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త , మెరుగైన ఆర్డర్‌లను పొందే అవకాశం ఉంది. దీంతో ఆర్థిక లాభాలను పొందుతారు. ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఈ కాలంలో తండ్రితో  వీరి సంబంధం స్నేహపూర్వకంగా, బలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందానికి దారితీస్తుంది. మొత్తంమీద ఈ సమయం కన్యారాశి వారికి పురోగతి , శ్రేయస్సుని తెస్తుంది.