రోజూ గడపకు పసుపు, కుంకుమ పెడుతున్నారా? ఇది తెలుసుకోండి

Updated on: Jun 12, 2026 | 6:46 PM

ప్రతి ఇంటికి ప్రధాన ద్వారం ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసి, ప్రధాన ద్వారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అందంగా అలంకరిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాకుండా, ఆర్థికంగా కలిసి వస్తుంది. సానుకూలత పెంపొందుతుంది అంటారు. అయితే కొంతే మంది నిత్యం గడపకు ముగ్గుపెట్టి, అందంగా అలంకరించినా వారి ఇంటిలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలే ఉంటాయి. దీనికి గల కారణాల గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులు కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అవి ఏవో చూద్దాం.

1 / 5
ఇంటి గడపలో సాక్ష్యాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది అంటారు. ఎవరు అయితే నిత్యం గడపపై మగ్గు పెట్టి, బొట్టుతో అందంగా అలంకరిస్తారో వారి ఇంటిలో ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని చెబుతారు. కానీ కొంత మంది గడపకు అందంగా పసుపు రాసి, అలంకరించినా వారి ఇంటిలో మానసిక ప్రశాంతత కరువు అవ్వడం, ఆర్థిక సమస్యలతో సతమతం అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి కారణం, పసుపు రాసే సమయంలో చేసే తప్పులే అంటున్నారు పండితులు.

2 / 5
భారతీయ సంస్కృతిలో ఇంటి గడపకు పసుపు, కుంకుమ దిద్దడం ఒక పవిత్రమైన, లోతైన అర్థం కలిగిన ఆచారం. కేవలం సంప్రదాయంగా భావించి చేసే ఈ పని వెనుక ఇంటి సుఖశాంతులకు, ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి.బయటి నుండి వచ్చే ప్రతికూల శక్తులు, ఈర్ష్య, చెడు దృష్టి, సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాకుండా నిరోధించే రక్షా కవచం. పురాణాల ప్రకారం, ఇంటి గడప సాక్షాత్తు లక్ష్మీదేవి నివాస స్థలంగా పరిగణించబడుతుంది. సముద్ర మథనంలో లక్ష్మీదేవి కన్నా ముందు జ్యేష్ఠాదేవి జన్మిస్తుంది. జ్యేష్ఠాదేవి అపరిశుభ్రతకు, కలహాలకు, దరిద్రానికి ప్రతీక. లక్ష్మీదేవి పరిశుభ్రతకు, ఐశ్వర్యానికి, సుగంధ పరిమళాలకు ప్రీతి పాత్రురాలు. ఎక్కడైతే గడప పసుపు కుంకుమలతో కళకళలాడుతూ శుభ్రంగా ఉంటుందో, అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గడప పసుపు లేక దుమ్ము పట్టి ఉంటే జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుందని చెబుతారు. కాబట్టి గడపకు పసుపు రాయడం అంటే జ్యేష్ఠాదేవిని బయటే ఆపి, లక్ష్మీదేవిని ఆహ్వానించడం.

3 / 5
అయితే కొంత మంది పసుపు రాసే సమయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా ఫోన్ మాట్లాడుతూ లేదా విసుగుతో పసుపు రాయడం చేస్తుంటారు. దీని వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి లోను అవుతుందంట. అంతే కాకుండా,  పసుపు రాసిన వెంటనే గడపను కాలుతో తొక్కడం, చీపురుతో గడపను కొట్టడం చేస్తుంటారు. ఇది అస్సలే మంచిది కాదంట. ఇది ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందంట.

4 / 5
దీని వలన ఇంటిలో అప్పుల బాధలు ఎక్కువ అవ్వడం, కలహాలు పెరగం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం జరుగుతుంది అని చెబుతన్నారు పండితులు. ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో గడపను పసుపుతో అలంకరిస్తుంటారో వారి ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివెరుస్తుందంట.అందుకే ఎప్పుడు గడపకు పసుపు రాసినా కుటుంబం క్షేమంగా ఉండాలని , లక్ష్మీదేవిని సమ్మరిస్తూ పసుపు రాయాలంట. అప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయిని చెబుతున్నారు పండితులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి