ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్కా, దేవికా, సంతోష్ అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే వ్యక్తి, తమ కెమెరామెన్ వికాస్‌ను వివాహం చేసుకున్నారు. మొదట కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా, వారు ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ బంధంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని వారు చెబుతున్నారు.