Cricket Retirement: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన అలెక్స్ హేల్స్ అద్భుత ప్రదర్శన చేయడమే కాక 47 బంతుల్లోనే అజేయంగా 86 పరుగులు చేశాడు. హేల్స్ ఆడిన ఈ కీలక ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్‌పై విరుచుకుపడిన హేల్స్ ఆగస్టు 4న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఇక అలెక్స్ రిటైర్‌మెంట్ అవుతున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ ఆకౌంట్ ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ కూడా 'థాంక్యూ అలెక్స్' అంటూ విడ్కోలు పలికింది.
అలెక్స్ తన పోస్టులో 'అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో మొత్తం 156 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు. ఇక ముందుకు సాగడానికి ఇదే సరైన సమయం' అంటూ రాసుకొచ్చాడు.
అలాగే 'ప్రపంచకప్ ఫైనల్ నా చివరి మ్యాచ్, ఇది నాకు గర్వకారణం. ఇంగ్గాండ్‌కు ఆడుతున్నప్పుడు నా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇది ఓ అపురూపమైన ప్రయాణం. ఈ ఒడుదుడుకుల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అందరూ నిలిచారు. ధన్యవాదాలు" అంటూ ఆలెక్స్ ముగించాడు.
కాగా, అలెక్స్ తరఫున ఆడిన 11 టెస్టుల్లో 573, 70 వన్డేల్లో 2419, 75 టీ20 మ్యాచ్‌ల్లో 2074 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అలెక్స్ పేరిట 6 వన్డే సెంచరీలు, ఒక టీ20 శతకం కూడా ఉంది. ఈ ఇంగ్లీష్ ఆటగాడు ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ తరఫున మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి 148 పరుగులు చేశాడు.