
ఇంటి ప్రధాన ద్వారం చాలా శక్తివంతమైనది. ఇంటి పురోగతి మొత్తం ప్రధాన ద్వారంపైనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఇంటి ప్రధాన ద్వారం గడపను లక్ష్మీస్థానం అంటారు. అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దల నమ్మకం. అందుకే గడప విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఏ ఇంటిలోనైనా సరే ప్రవేశ ప్రధాన ద్వారం లక్ష్మీదేవిలా భావించి పూజలు చేస్తుంటారు. ప్రతి రోజూ ఉదయం గడపకు పసుపు పూసి, ముగ్గులు వేసి, కుంకుమతో అందంగా అలంకరిస్తారు. అలాగే గడపను గౌరవంగా చూసుకుంటారు. ఎందుకంటే? ఇది ఇంటిలోకి ప్రతికూల శక్తిని అడ్డుకొని, సానుకూల శక్తిని ప్రేరేపిస్తుంది కాబట్టి. గడపను అగౌరవ పరిస్తే లక్ష్మీదేవిని అగౌరవించినట్లు. దీని వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని చెబుతారు పండితులు.

ఇక మన పెద్దవారు ఇంటి ఆడపిల్ల అస్సలే గడప పై కూర్చకూడదు అంటారు. దీనికి కూడా ఒక కారణం ఉన్నదంట. గడపపై లేదా గుమ్మం ముందు కూర్చోవడం వలన దృష్టశక్తుల ప్రభావం అనేది విపరీతంగా పెరుగుతుందంట. అంతే కాకుండా ఇంటిలో ఆర్థిక సమస్యలు ఏర్పడటం, అప్పులు పెరగడం, ఊహించని విధంగా ఖర్చులు కావడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు.

అంతే కాకుండా, ఇంటి గడప పై కాలు పెట్టడం లక్ష్మీదేవిని అగౌరవించినట్లు, దీని వలన లక్ష్మీదేవి కోపానికి గురై, ఇంటి నుంచి వెళ్లి పోతుంది. దీని వలన అనేక సమస్యలు ఎరదుర్కోవాల్సి వస్తుంది. ఇంటిలో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. దీని వలన ఇంటి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, విభేదాలు, కెరీర్ పరంగా అడ్డంకులు ఏర్పడటం. అనుకున్న పని సమయానికి పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే ప్రధాన ద్వారం గడప విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.