
వృషభం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలాఖరు వరకు దిగ్బల రాజయోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవ, కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.

మిథునం: ఈ రాశిలో గురు సంచారం వల్ల జూన్ మొదటి వారం వరకు ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. దీనివల్ల జూన్ 20 లోగా ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ వంటివి సంభవిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం: ఈ రాశికి దశమంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. జూన్ 15 లోపల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఊహించని స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం ఏర్పడుతుంది. ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఈ ఏడాదంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి ఆస్కారముంటుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోవడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో, ఉన్నత వర్గాలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. మరో 20 రోజులు పని చేసే ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి.