Astrology: ఆ రాశుల వారికి కొత్త జీవితం..! మనసులో కోరికలు నెరవేరడం ఖాయం

Edited By: Janardhan Veluru

Updated on: Dec 02, 2025 | 3:55 PM

చంద్ర గ్రహంతో ఏర్పడే యోగాలు తప్పకుండా ఫలిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. చంద్రుడి సంచారంతో ఏర్పడే ఏ యోగమైనా తక్కువ రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తక్కువ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా అత్యుత్తమ ఫలితాలనిస్తాయని జ్యోతిషశాస్త్రం పేర్కొనడం జరిగింది. ఈ నెల(డిసెంబర్) 3, 4, 5 తేదీల్లో వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం ఒక విశేషంగా కాగా, ఈ పౌర్ణమి చంద్రుడిని మీన రాశి నుంచి శనీశ్వరుడు, వృశ్చిక రాశి నుంచి రవి, కుజ, శుక్ర గ్రహాలు వీక్షించడం మరో విశేషం. ఈ మూడు రోజులూ వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు పండుగ రోజులే. ఆ రోజు మనసులో కోరుకున్నవి తప్పకుండా నెరవేరుతాయి.

1 / 6
వృషభం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న పౌర్ణమి చంద్రుడిని నాలుగు గ్రహాలు వీక్షించడం వల్ల ఈ రాశివారికి మహా రాజయోగం కలిగింది. వీరికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. అనేక ఆదాయ అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు బాగా లాభిస్తాయి.

2 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం, దాన్ని నాలుగు గ్రహాలు వీక్షించడం వల్ల ఒక ప్రముఖుడుగా, ఒక సంపన్నుడుగా ఎదిగే అవకాశం ఉంది. వివిధ రంగాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ తో పాటు రాబడి పెరుగుతుంది.

3 / 6
తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ఉచ్ఛపట్టడం, దాన్ని నాలుగు గ్రహాలు చూడడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఇప్పటికే వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4 / 6
వృశ్చికం: సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టిన చంద్రుడిని రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు వీక్షించడం వల్ల ఈ రాశివారికి చంద్ర మంగళ యోగంతో సహా రాజయోగాలు, ధన యోగాలు కలిగాయి. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వల్ప ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సగటు వ్యక్తి కూడా సంపన్నుడవుతాడు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛపట్టిన చంద్రుడిని రాశ్యధిపతి శనితో పాటు మూడు గ్రహాలు  పూర్ణ దృష్టితో చూడడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రణాళిక ప్రకారం ప్రయత్నాలు సాగించే పక్షంలో ఈ రాశివారు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. ప్రముఖులు, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందడం, రాజకీయ ప్రాబల్యం కలగడం, ప్రభుత్వ గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది.

6 / 6
కుంభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, దాన్ని రాశ్యధిపతి శనితో సహా మూడు గ్రహాలు వీక్షించడం వల్ల ఈ రాశివారికి గృహ, వాహన యోగాలు కలగడం, ఆస్తిపాస్తులు కలిసిరావడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తుల విలువ పెరగడం వంటివి జరుగుతాయి. మాతృ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటివి జరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.