మట్టి వినాయకుడిని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసా?

Updated on: Sep 09, 2026 | 5:36 PM

వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా మంది తమ ఇంటిలోనే అందమైన మట్టి గణపతిని తయారు చేసుకోవాలని ఉంటుంది. మరి దానిని సులభంగా ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా తక్కువ సమయంలోనే మన ఇంటిలో మట్టి గణపతిని తయారు చేసుకోవచ్చునంట. అది ఎలా అంటే?

1 / 5
ముందుగా, బంకమట్టిని తీసుకోవాలి. దీనిని నీటితో కలిపి బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత, వివిధ పరిమాణాలలో పది గుండ్రటి ఉండలను తయారు చేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉండ బొజ్జకు, రెండు మధ్యస్థ ఉండలు బేస్, తల భాగానికి, ఇంకా చిన్నవి రెండు కాళ్ళకు, రెండు చేతులకు, చెవులకు, చివరిది తొండానికి కేటాయించాలి.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే, ముందుగా బేస్ కోసం తీసుకున్న ఉండను తీసుకొని, దానిని చదునుగా చేసుకోవాలి. తర్వాత పెద్ద ఉండను, బొజ్జ కోసం తయారు చేసిన దానిని తీసుకొని, బేస్ పై గట్టిగా అలంకరించాలి. తర్వాత చిన్ని చిన్న ఉండలు తీసుకొని వాటిని కాళ్లు చేతుల ఆకారం చేసి, బొజ్జ ఉండకు అంటించాలి. తర్వాత తొండం కోసం ఒక ఉండను తీసుకొని దానిని సరైన ఆకారంలో చేసి బొజ్జకు అంటించాలి.

3 / 5
ఇప్పుడు తల కోసం తీసుకున్న బంకమట్టి ఉండను తీసుకొని దానిని తల భాగంలో పైన అంటించాలి. బొజ్జ భాగం, తల భాగ సరిగ్గా కలిసేలా చూసుకోవాలి. తర్వాత చెవులు ఏర్పాటు చేయాలి. రెండు చిన్న ఉండలను తీసుకొని చెవుల మాదిరి తయారు చేసి, తలకు రెండు వైపులా అంటించాలి. ఆ తర్వాత, గణపతి దంతాలను చిన్న మట్టి ముక్కలతో అమర్చాలి.

4 / 5
ఇప్పుడు గణపతికి కళ్లను అమర్చాలి, తర్వాత చిన్న పుల్ల సహాయంతో నామాలు వత్తాలి. ఆతర్వాత కిరీటం మట్టి సహాయంతో తయారు చేసి అమర్చిన తర్వాత, చిన్న దారంతో జంధ్యం వేయాలి. ఆ తర్వాత చిన్న మట్టి ఉండను లడ్డూ ఆకారంలో చేసి గణపతి చేతిలో పెట్టాలి. అంతే మహా మట్టి గణపతి రెడీ.ఈ విధంగా తయారు చేసుకున్న మట్టి గణపతిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నమ్మకం.

5 / 5
 ఈ ప్రక్రియ కేవలం పర్యావరణ హితమైనదే కాకుండా, భక్తి భావనను పెంచుతుంది. ఇంట్లో స్వయంగా గణపతిని తయారు చేసి పూజించడం ద్వారా భోగభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, ఆ వినాయకుడు ఆశీర్వదిస్తాడని చెబుతారు. అంతేకాకుండా, నిమజ్జనం చేసే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యం లేకుండా, మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఈ పద్ధతిని అనుసరించి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us