
చెన్న కేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు. ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలోని రక రకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది.

ఈ ఆలయాన్ని మృదువైన సున్నపు రాయితో నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు.

ఇక్కడ పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.

ఆలయం ప్రవేశ ద్వారం వద్దే ఒక పుష్కరణిని (మెట్లబావి) ఉంటుంది.

అలాగే ఇక్కడ వివిధ నర్తకిల శిల్పాలు రకారకాల భంగిమలలో ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగినవి.

ఆలయం అంతర్బాగంలో రాజగోపురాలు, చేన్నిగరాయ ఆలయం, లక్ష్మీ దేవి ఆలయం ఉంటాయి.

ఆలయం బయట 42 అడుగుల ధ్వజస్తంబం ఉంటుంది. దీనిని మాహా స్తంభం, కార్తీక దీపోత్సవ స్తంభం అంటారు. ఇది ఒకవైపు నెలను తాకి ఉండదు. కేవలం మూడు వైపుల మాత్రమే ఆధారపడి ఉంటుంది.

బేలూరు చెన్నకేశవ ఆలయం