Chanakya Niti: ఈ జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలంటే.. ఈ 5 విషయాలను పాటించమంటున్న చాణక్య

|

May 07, 2022 | 12:19 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. ఇవి వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని పెద్దల నమ్మకం.తన జీవితంలో ఎటువంటి కష్టనష్టాలు రాకుండా నివారించాలంటేనే ఒక వ్యక్తి సమయానికి అప్రమత్తంగా ఉండి, తన పనిని జాగ్రత్తగా చేయాలనీ తెలిపారు. చాణక్యుడు చెప్పిన 5 విషయాల గురించి తెలుసుకుందాం

1 / 5
నడుస్తున్నప్పుడు, ప్రతి వ్యక్తి తన దృష్టిని నేలమీద కూడా ఉంచాలి. నెల వైపు చూడకుండా ప్రయాణించేవారు తమ కష్టాలను తామే ఆహ్వానిస్తూ ప్రమాదాల బారిన పడతారు. అటువంటి పరిస్థితిలో, శారీరక నొప్పితో పాటు, ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది

2 / 5
 శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ నీటిని శుభ్రం చేసుకుని తాగాల్సి ఉంది. మురికి నీటి తాగడం వలన అనేక రకాల శారీరక వ్యాధులు కలుగుతాయి. అయితే ప్రస్తుతం నీటి విషయంలో అలాంటి వారికి అవగాహన పెరిగింది. అందుకే ప్రతి ఇంట్లోనూ ప్యూరిఫయర్లు వాడుతున్నారు.

3 / 5
ఎవరి మనస్సు అయితే స్థిరంగా ఉండదో.. అటువంటి వ్యక్తి ప్రజల మధ్య లేదా అడవిలో ఉన్నా ఆనందం ఉండదు. అలాంటి వ్యక్తులు అసూయతో నిండి ఉంటారు. ఎక్కడ ఉన్నా ఒంటరితనంతో గడపాల్సి ఉంటుంది. కనుక మనసు ఎప్పుడు స్థిరమైన ఆలోచనలో ఉండేలా  ప్రయత్నించండి.

4 / 5
ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు బాగా ఆలోచించి, అర్థం చేసుకొని తీర్మానం చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిండు మనసుతో ఆ పని చేయండి. అప్పుడే విజయం సాధిస్తారు.

5 / 5
అబద్ధం చెప్పే అలవాటు ఒక వ్యక్తిని ఖచ్చితంగా ఏదొక రోజు కష్టాల్లోకి నెడుతుంది. ఒక అబద్ధాన్నికప్పి పుచ్చడానికి అతను మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఇదొక రోజు అతడే స్వయంగా చిక్కుల్లో చిక్కుకుంటాడు. అందుకే ఎప్పుడూ ఏ సందర్భంలోనూ అబద్ధాలను చెప్పవద్దు అంటున్నారు చాణక్య