
జ్యోతిషశాస్త్రంలో బుధ సంచారం లేదా దాని రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. బుధుడిని తెలివితేటలు, నైపుణ్యాలు, వాక్చాతుర్యం, సంభాషణకు అధిపతిగా పరిగణిస్తారు. ప్రస్తుతం బుధుడు తులారాశిలో సంచారము చేస్తున్నాడు. దీపావళి పండుగ తర్వాత అక్టోబర్ 24న బుధుని రాశి మార్పు జరుగుతుంది. అక్టోబర్ 24న బుధుడు తులారాశి నుంచి బయలుదేరి వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు.

ధృక్ పంచాంగం ప్రకారం బుధుడు అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిని అగ్ని రాశి అయిన కుజుడు పాలిస్తాడు. ఈ బుధ సంచారము ఒక వ్యక్తి ఆలోచన, కమ్యూనికేషన్ శైలి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది. ఈ సంచారం వలన మొత్తం రాశులపై ప్రభావం పడుతుంది. అయితే ఈ బుధ సంచారం మూడు రాశుల్లో జన్మించిన వారికి బుధ సంచారము ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మూడు రాశుల వారి కెరీర్లు, పెట్టుబడులు, వ్యాపారంలో అద్భుతమైన మార్పులను అనుభవించవచ్చు. కనుక అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశిలో బుధ సంచారము ఈ రాశిలో జన్మించిన వారి మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ప్రసంగం మరింత ప్రభావవంతంగా మారవచ్చు. ఆలోచనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. నమ్మకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరీర్, వ్యాపారం మెరుగుపడతాయి.

మిథున రాశి: వృశ్చికరాశిలో బుధుడు సంచరించడం వల్ల మిథునరాశి వారికి వ్యూహాత్మక ప్రయోజనాలు లభిస్తాయి. వీరు కొత్త ప్రణాళికలను రూపొందించి సక్సెస్ అవుతారు. నిలిచిపోయిన పాత డబ్బును తిరిగి పొందగలరు. పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. విదేశాల నుంచి దిగుమతి.. ఎగుమతిలో నిమగ్నమైన వారు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు.

మేషరాశి: వృశ్చికరాశిలో బుధుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడులు, బీమా, స్టాక్ మార్కెట్ లేదా కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయాలలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త కెరీర్ అవకాశాలు రావచ్చు. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.