
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో అనేక రకాల మొక్కలు పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. అయితే చాలా మంది ఇంటిలో ఇదొక్కటి ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ మనీ ప్లాంట్ కాకుండా ఈ ఐదు మొక్కలు ఇంటిలో నాటుకోవడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. దీని వలన కలిసి వస్తుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తులసి మొక్క ఉండటం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ప్రతి కూలత తగ్గిపోయి, సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా ఇది ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూరుతాయంట.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో స్నేక్ ప్లాంట్ ఉండటం చాలా మంచిది. ఇది దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో పెట్టడం వలన చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం కూడా డబుల్ అవుతుందంట. బెడ్ రూమ్‌లో స్నేక్ ప్లాంట్ ఉండటం వలన ప్రశాంతంగా నిద్రపట్టడమే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

మనీ ప్లాంట్ మొక్క మాత్రమే కాకుండా ఇంటిలో వెదురు మొక్క ఉండటం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. చాలా మంది మనీ ప్లాంట్ మొక్క ఉంటనే ఆదాయం రెట్టింపు అవుతుంది అనుకుంటారు. కానీ ఇంటిలో వెదురు మొక్క ఉండటం చాలా మంచిదంట. దీని వలన అదృష్టం పెరగడమే కాకుండా సంపద కూడా రెట్టింపు అవుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు