
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది ఇంటిలో సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు. ఇక కొందరి ఇంటిలో అయితే ఎంత సంపాదించినా డబ్బు నీళ్లలా ఖర్చు అవుతూనే ఉంటుంది. అయితే వాటన్నింటి నుంచి బయటపడాలి అంటే, ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించాలంట. అయితే మీరు ఇప్పటికీ ఆ సమస్యలు ఎదుర్కుంటే, ఆలస్యం చేయకుండా ఈరోజు నుంచే ఈ నాలుగు చిట్కాలు పాటించాలి.

ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంటిలో నవ్వుతున్న బుద్దుడి విగ్రహం పెట్టడం చాలా మంచిది. దీని వలన ఇంటిలో సంపద పెరగడమే కాకుండా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి. అంతే కాకుండా మీ ఇంటిలో డబ్బుకు కొదవ ఉండదు. అప్పుల బాధలు అన్నీ కూడా తొలిగిపోయి, చాలా ఆనందంగా, ఉంటారు. అందువలన మీరు ఇప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లు అయితే వెంటనే, నవ్వుతున్న బుద్ధుడి విగ్రహం ఇంటిలో పెట్టుకోవడం మంచిది.

ఫెంగ్ షుయ్ తాబేలు : ఇది కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. అయితే దీనిని ఒక గాజు గిన్నెలో పెట్టి, ఇంటిలో ఉత్తరం దిశలో పెట్టడం చాలా శుభప్రదంట. దీని వలన ఇది సంపదను ఆకర్షించడమే కాకుండా ఆనందం, శ్రేయస్సును కూడా నింపుతుంది.

అంతే కాకుండా ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటిలో గాలి గంటలకు కూడా చాలా మంచిది. ఇవి ఇంటి అలంకరణ కోసమే కాకుండా అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. గాలి వలన వీటి నుంచి వచ్చే శబ్ధం ఇంటిలో సానుకూలతను పెంపొందిస్తుంది. అంతే కాకుండా ఇది మీకు లక్కును కూడా తీసుకొస్తుంది. కాబట్టి వీటిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఆనందం, డబ్బు, శ్రేయస్సు అన్నీ కూడా పెరుగుతాయి.

ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంటిలో చైనీస్ నాణేలు పెట్టడం కూడా చాలా శుభప్రదం. ఇవి ఎవరి ఇంటిలోనైతే ఉంటాయో, వారి ఇంటిలో ఆర్థిక సమస్యలే ఉండవంట. అప్పుల బాధలు త్వరగా తొలిగిపోతాయి. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు