
రాహు కేతువులు రాశి సంచారం చేయనున్నాయంట. రాహుకు మకర రాశిలోకి సంచారం చేయనుంది అంతే కాకుండా కేతువు కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. ఈ రెండు గ్రహాల సంచారం మూడు రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే కానున్నదంట. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి : మేష రాశి వారికి రాహు కేతు సంచారం వలన ఊహకందని ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడే వారు దాని నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వస్తుంది. చాలా అద్భుతమై సమయంగా చెప్పవచ్చును.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సమయంలో ఏది ముట్టినా సరే అది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. విద్యార్థులకు మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది వీరికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి నీడ గ్రహాల సంచారం వలన విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ రాశి వారికి ఇది చాలా వరకు సువర్ణ అవకాశం అని చెప్పాలి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు