
మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల డిసెంబర్ వరకు ఆదాయం ఏదో విధంగా వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగదు. ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గడానికి లాభ స్థానంలోని రాహువు తోడ్పడుతుంది. ఈ రాహువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి చోట చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి సంచారం వల్ల ఈ ఏడాదంతా వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపార ఒప్పం దాలు, ఆస్తి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం ఉచ్ఛపట్టి ఉండడం, ఈ నెల 26 తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు ధన వర్షం కురిపిస్తాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన గురువు సంచారం జరుగుతున్నందు వల్ల అష్టమ శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రభుత్వ మూలక ధన లాభం, ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛపట్టడం, మార్చి 26 తర్వాత పంచమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కుటుంబంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. వివాహాది శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదం, కోర్టు కేసులు వంటివి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు.

మకరం: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. భూలాభం కలుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాట వాలకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.