
పండితుల ప్రకారం.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే పడుకునే ముందు మీ పడకగదిలో కర్పూరాన్ని కాల్చాలి. ఈ పొగ ఇంట్లో ఉన్న నెగెటీవ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుంది.ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతాయని విశ్వాసం.

ఇంట్లోని స్త్రీ నిద్రపోయే ముందు ఆవనూనెను ఇంటికి దక్షిణ దిక్కున కొంత రాయాలని అంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు వర్ధిల్లుతాయట. ఒకవేళ ఇంట్లో దీపం వెలిగించకపోతే.. బల్బ్‌ను అయినా వెలిగించాలి.

రాత్రిపూట ఇంట్లో చెదురుమదురుగా ఉన్న వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుందట. అది అనర్ధాలకు దారి తీస్తుందట.

ఇంట్లో పెద్దలను ఎప్పుడూ గౌరవించాలి. స్త్రీలు తమ తల్లిదండ్రులను, అత్తమామలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుందని చెబుతారు.