Amavasya Horoscope: అమావాస్యలోనూ శుభ ఫలితాలు.. ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!

Edited By: Janardhan Veluru

Updated on: Jun 20, 2025 | 1:13 PM

Lucky Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు గ్రహం అత్యంత శుభ గ్రహం. ఈ గురు గ్రహానికి శని, రాహువుల వంటి పాప గ్రహాలను కూడా శుభ గ్రహాలుగా మార్చే శక్తి ఉంది. గురువుతో కలిసి ఉన్నా, గురువు చూసినా ప్రతి గ్రహమూ శుభ ఫలితాలనిస్తుంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురు గ్రహం అనుకూల స్థానంలో ఉన్న పక్షంలో జాతకుడి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. జూన్ 25, 26, 27 తేదీల్లో మిథున రాశిలో ఏర్పడుతున్న రవి, చంద్రుల కలయిక (అమావాస్య) కూడా గురుడి యుతి వల్ల అత్యంత శుభప్రదంగా మారుతోంది. ఈ అమావాస్య దాదాపు పౌర్ణమి ఫలితాలనిస్తుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి ఇంటి తలుపులను అదృష్టం తట్టే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురు, చంద్ర, రవుల కలయిక జరుగుతున్నందువల్ల ఈ మూడు రోజుల్లో ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రతి ప్రయత్నమూ నూటికి నూరు పాళ్ళు కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగించడానికి, మార్గాలను అన్వేషించడానికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు. రావలసిన సొమ్మును, బాకీలను, బకాయిలను అతి తేలికగా రాబట్టుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశిలో అమావాస్య చంద్రుడితో గురువు కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారికి ఊహించని ధన, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడులతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలు వైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. పిత్రార్జితం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, చంద్ర, రవుల యుతి వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సంతృప్తికరంగా సఫలమవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాలు చేపట్టడానికి ఇది బాగా అను కూల సమయం. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి.

4 / 6
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు, రవి, చంద్రుల కలయిక వల్ల ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. త్వరలో విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి సప్తమంలో అమావాస్య ఏర్పడడం, గురువుతో యుతి చెందడం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపో తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

6 / 6
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, చంద్ర, గురువుల యుతి జరుగుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు విశేష లాభాలనిస్తాయి. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. ఉద్యోగాలు, ఉన్నత విద్యల కోసం పిల్లలు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంతాన యోగం పడుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.