Sri Rama Navami 2021: నరుడుగా పుట్టి.. దైవంగా పూజలందుకుంటున్న శ్రీరాముడి గుణాలు ఏమిటంటే..!

|

Apr 15, 2021 | 5:38 PM

రావణుడి సంహారం కోసం నరుడుగా జన్మించాడు శ్రీవిష్ణువు. మానవుడిగా పుట్టి.. దేవుడిగా కొలవబడుతున్నాడు. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా.. మనిషి ధర్మం తప్పకుండా ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు

1 / 5
త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేశాడని హిందువుల విశ్వాసం. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడని రామాయణం ద్వారా తెలుస్తుంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ మూర్తిగా కొలవబడుతున్నాడు. రామాలయం లేని ఊరు స్మశానంలో సమానం అనే నమ్మకం హిందువులది.

2 / 5
వాల్మీకి రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నాయని చెప్పారు. రాముడిని అనుసరిస్తూ.. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు.ఒక మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా తన ధర్మాన్ని ఎలా నెరవేర్చాలో చూపించి ఆదర్శపురుషుడుగా నిలిచాడు శ్రీరాముడు.

3 / 5

రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి.. సుణాభిరాముడయ్యాడు. మానవ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు భక్తికి ప్రతీక.

4 / 5
శ్రీమహాలక్ష్మి అయోనిజగా సీతగా జనకుడి ఇంట పెరిగి.. రాముడిని పరిణయమాడింది. భర్త అడుగు జాడల్లో నడుస్తూ.. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక అయ్యింది. ఇక అన్నకి సేవ చేస్తూ.. 14 ఏళ్ళు వనవాసం లో ఉన్న లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీకగా నిలిచాడు. శ్రీరామచంద్రమూర్తిని తన దైవంగా తలచి భక్తితో కొలిచి రాముడిని తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు భక్తికి ప్రతీకగా నిలిచాడు.. నేటికీ కొలవబడుతున్నారు.

5 / 5
Hanuman

Hanuman