
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. చికెన్ కేజీ, కారం, పచ్చిమిర్చీ, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శాజీరా, కొత్తిమీర, పూదీనా, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు రెండు లేదా మూడు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చి మిర్చీ, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఒక టమాటా.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఆనియన్ పేస్ట్, పసుపు , చిటికెడు నూనె వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో చికెన్ వండటానికి సరిపడ నూనె వేయాలి. తర్వాత పోపు ప్రిపేర్ చేసుకోవాలి.

దీని కోసం ఆయిల్ వేడి అయ్యాక, శాజీర, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, దాల్చిన చెక్క, అన్నీ వేసి మంచిగ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినెట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసి పోపులో వేసి మంచిగా కలుపుకోవాలి. చికెన్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

తర్వాత రుచికి సరిపడ ఉప్పు , కారం వేసి మంచిగా కలుపుకోవాలి. చిన్న గ్లాస్లో సగం వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. దాదాపు మరో పావుగంట సేపు చికెన్ మంచిగా మెత్తగా ఉడికే వరకు కలుపుతూ గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికే క్రమంలో చికెన్ మంచి వాసన వస్తుంది. అప్పుడు అది ఉడికిపోతుంది అని అర్థం.

అప్పుడు మూత తీసి గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత చివరగా కొత్తిమీ, పూదీనా కూడా వేసి మరో ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే, అంతే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మరి మీరు కూడా ఈ రిసిపీ ప్రిపేర్ చేసుకోండి.