
టమాటా పులావ్‌కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు బాస్మతి బియ్యం , నాలుగు టమాటాలు, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నాలుగు పుదీనా ఆకులు , కొద్దిగా కొత్తిమీర , పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు , నీరు , నూనె , బిర్యానీ ఆకు, లవంగాలు , యాలకులు , దాల్చినచెక్క , ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.

ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని రెండు, మూడు సార్లు కడిగి కనీసం 20 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ తరువాత నాలుగు పండిన టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇంకా టేస్టీగా రావాలంటే టమాటాలు పండినవే వేస్తే పుల్ల పుల్లగా అదిరిపోతోంది .

ఇక ఇప్పుడు కుక్కర్ లేదా గిన్నెలో నూనె కానీ నెయ్యి కానీ తీసుకుని దానిలో బిర్యానీ ఆకు, నాలుగు లవంగాలు, ఇంకా దాల్చినచెక్క, నాలుగు యాలకులు కూడా బాగా వేయించాలి. ఇంకా ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించి అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి.

ఇక ఇప్పుడు కొద్దీ సేపటి తరవాత తరిగిన టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి టమాటాలు మెత్తబడే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఈ సమయంలోనే పులావ్ ఘాటు, పుల్లటి రుచి వస్తుంది.

ఇక చివర్లో నానబెట్టిన బియ్యాన్ని వేసి వాటితో తో రెండు గ్లాస్ ల నీరు, తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టాలి. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇంకా ఈ గిన్నెలో చేస్తే మీడియం మంటపై ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర, పుదీనా వేస్తె మంచి సువాసనతో సూపర్ ఉంటుంది.