
కావాల్సిన పదార్ధాలు: 3 పచ్చి జామకాయలు, 5 నూనె టేబుల్ స్పూన్లు, ఒక కప్పు పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు రుచికి సరిపడినంత, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి 5, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు , కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా జామకాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో చింతపండును నానబెట్టాలి.

స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, పల్లీలను వేసి రంగు మారే వరకు వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత పచ్చి మిర్చి వేసి నూనెలో వేయించాలి.

పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ గ్రైండ్ చేసి.. ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. ఆ తర్వాత జామకాయ ముక్కలు, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి.

పోపు కోసం పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక తాలింపు గింజలు వేసి మినపప్పు కూడా కొద్దిగా వేసి వేగనివ్వవాలి. ఇక ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. దానిలో అర టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని దీనిని ఈ పచ్చడిలో పోయాలి. అంతే వేడి వేడి జామకాయ పచ్చడి రెడీ.