Sour Burps: పుల్లటి త్రేన్పులు వస్తున్నాయా.. ఈ ఇంటి చిట్కాలతో ఈజీగా తగ్గించవచ్చు..

Updated on: Jan 25, 2025 | 5:01 PM

ఆహారం తిన్న తర్వాత త్రేన్పులు రావడం అనేది కామన్. కానీ కొంత మందికి పుల్లటి త్రేన్పులు వస్తాయి. వీటితో పాటు నోటి నుంచి వాసన కూడా వస్తుంది. పుల్లటి త్రేన్పులతో ఇబ్బంది పడేవారు.. ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి. ఇవి ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. మరి అవేంటో చూసేయండి..

1 / 5
సాధారణంగా అప్పుడప్పుడు త్రేన్పులు రావడం కామన్ విషయం. కానీ ఇవి పుల్లగా వస్తూ ఇబ్బంది పెడితే మాత్రం గ్యాస్ సమస్యలు ఉన్నట్టే. స్పైసీ, ఆయిల్ వంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఇలా త్రేన్పులు వచ్చినప్పుడు దుర్వాసన వస్తుంది. ఛాతిలో, గొంతులో కూడా మంట కలుగుతుంది.

2 / 5
ఇలా పుల్లటి త్రేన్పుల కారణంగా అనారోగ్య సమస్యలు రావచ్చు. పుల్లటి త్రేన్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వీటిని తగ్గించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

3 / 5
పుల్లటి త్రేన్పులను తగ్గించడంలో జీలకర్ర చక్కగా పని చేస్తుంది. మీకు పుల్లటి త్రేన్పులు వస్తున్నట్లయితే.. వెంటనే ఒక అరస్పూన్ జీలకర్రను బాగా నమిలి తినండి. దీని వల్ల త్రేన్పులు తగ్గుతాయి.

పుల్లటి త్రేన్పులను తగ్గించడంలో జీలకర్ర చక్కగా పని చేస్తుంది. మీకు పుల్లటి త్రేన్పులు వస్తున్నట్లయితే.. వెంటనే ఒక అరస్పూన్ జీలకర్రను బాగా నమిలి తినండి. దీని వల్ల త్రేన్పులు తగ్గుతాయి.

4 / 5
సోంపు కూడా పుల్లటి త్రేన్పులను తగ్గించడంలో సహాయ పడుతుంది. వాము నమిలినా లేదా మరిగించిన వాము నీటిని తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. గుండెల్లో, గొంతు మంట కూడా తగ్గుతుంది.

సోంపు కూడా పుల్లటి త్రేన్పులను తగ్గించడంలో సహాయ పడుతుంది. వాము నమిలినా లేదా మరిగించిన వాము నీటిని తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. గుండెల్లో, గొంతు మంట కూడా తగ్గుతుంది.

5 / 5
పుదీనా తిన్నా, పుదీనా నీటిని తాగినా, తులిసి ఆకులు నమిలినా, ధనియాల నీరు తాగినా, నిమ్మరసం తాగినా, చిటికెడు ఇంగువ నీటిలో కలిపి తాగినా ఈ పుల్లటి త్రేన్పులు అనేవి కంట్రోల్ అవుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పుదీనా తిన్నా, పుదీనా నీటిని తాగినా, తులిసి ఆకులు నమిలినా, ధనియాల నీరు తాగినా, నిమ్మరసం తాగినా, చిటికెడు ఇంగువ నీటిలో కలిపి తాగినా ఈ పుల్లటి త్రేన్పులు అనేవి కంట్రోల్ అవుతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)