
చాలా మంది అందంగా కనిపించడానికి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఐతే అవి దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగిస్తాయనే విషయం మర్చిపోకూడదు. మీ ముఖం సహజ కాంతితో మెరవాలంటే ఈ పద్ధతులు పాటించండి.

రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ముఖానికి సహజమైన మెరుపును తీసుకురావడానికి పని చేస్తుంది. ముఖంపై పేరుకుపోయిన మురికిని, మృత చర్మాన్ని తొలగించడానికి పని చేస్తుంది. అందువల్ల ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కొని పడుకోవాలి.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

దానిమ్మ రసం తాగడం వల్ల.. శరీరంలోని మలినాలన్నింటినీ బయటికి పోతాయి.

అధికంగా నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేడెట్‌గా ఉండటమేకాకుండా చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.